పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0336-1 సాళంగం సంపుటం: 11-211

పల్లవి: ఇంచుకంతా నెరఁగరు యేఁటిదే మీరు
         మంచివారు గలితిరి మానరుగా చెలులు

చ. 1: మంకుల వొట్టు వెట్టుక మాటలాడ మన్నమీఁద
       యింకా నామాటలా యెరఁగరటే
       అంకెల నన్నుఁ గలయు మనేరు దోసాలకుఁ
       గొంకరు అప్పటి మీరు కూళలటే చెలులు

చ. 2: తోడనె వాదు వెట్టుక తొలఁగి వచ్చినమీఁద
        యీడా నాడాఁ దగవులా యిదిఁ గొంతా
        వీడనీ కాతని నీ వెంటఁ దోడి తెచ్చితిరి
        ఆడికెకు వెరవరు హంత లటే చెలులు

చ. 3: యెదురెదురుకట్ల నింతకు వచ్చినమీఁద
        అదిమి కాఁగిలింపించే రౌనే మీరు
        అదన శ్రీవెంకటేశుఁ డంతలోనే నన్ను గూడె
        సదరాన నవ్వేరు జాణలుగా చెలులు