పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0335-6 సామంతం సంపుటం: 11-210

పల్లవి: వినవే యా మాఁట వెలది నీకు నీవె
         అనవే నీ నోటనే అందుకు నుత్తరము

చ. 1: పిలిచీఁ గదవె తాను బెట్టుగ సిగ్గు వడఁడు
       పిలిచెటిపెద వెందో పిప్పి గట్టెను
       కలయు మనీనె కమ్మటిని నన్నును
       కలనే తన వురము కాయ గాచె నదివో

చ. 2: నవ్వీఁ గదవె తాను నాతోనుఁ గమ్మటిని
       నవ్వెటి తన చెక్కులు నంజు లాయను
       పవ్వళించీఁ గదె నా పక్కనె తా నప్పటిని
       పవ్వళించే యందె తన పను లెల్లఁ దెలిసే

చ. 3: చేతుల చాచీఁ గదె చేరి నా కాఁగిటికి నా
        చేతికి లోనైనవారు చెలులెల్లాను
        యీతల శ్రీవెంకటేశుఁ డిప్పు డిట్టె నన్నుఁ గూడె
        యీతలాతలిపనులు యెన్ని కాయఁ గదవే