పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0335-5 సౌరాష్ట్రం సంపుటం: 11-209

పల్లవి: ఇంతకంటె నాతఁడు మ రేమి సేసునే
         యింతులాల రమణుని నేల దూరేరే

చ. 1: కన్నుల మెక్కనె పట్టె కాఁకఁల బెనఁగఁ బట్టె
       వెన్నెలనవ్వులు నవ్వ వేళ లేదే
       పన్ని నెత్త మాడఁ బట్టె పరాకు నేయనె పట్టె
       యిన్నిటా జాణఁడు వాని నేల దూరేరే

చ. 2: సరస మాడఁ బట్టె సంగడిఁ గూచుండఁ బట్టె
       విరులు ముడువ నైన వేళ లేదే
       కురులు దువ్వనె పట్టెఁ గొలువు సేయనె పట్టె
       యిర వెరుఁగు నాతఁడె యేల దూరేరే

చ. 3: చొక్కుచు నుండనె పట్టె సుద్దులు చెప్పనె పట్టె
       వెక్క సపురతులకు వేళ లేదే
       పక్కన శ్రీవెంకటాద్రిపతి నన్ను నిటు గూడె
       నిక్కడ నే విన నోప నేల దూరేరే