పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0335-4 హిందోళం సంపుటం: 11-208

పల్లవి: రమ్మనఁగాఁ దనతోనే రా నంటినా
         చిమ్ముచు నింత ప్రియము చెప్ప నేలె నాకు

చ. 1: వెల్లవిరిఁ దనమాఁట విన నైతినా నేను
       చెల్లఁబో నా కేల సేవ సేసీని తాను
       యెల్లవారిఁ దా నేలీ నెవ్వరిఁ బోలుదు నేను
       బల్లిదుఁడు నా కేల బాఁతి పడీఁ దానూ

చ. 2: చెప్పిన ట్టెల్లా నేను సేయకుండేదాననా
        అప్పటి లేక లేఁటికి నంపీనె తాను
        కప్పురపు పడిగల కాంతలు గాచుకుండఁగా
        విప్పుచు నాకుఁగా నేల వేగించేనె తానూ

చ. 3: గక్కనఁ దా గూడఁగాను కాదు గూడ దంటినా
        ముక్కు మోవ సాగి లెల మొక్కీనె తాను
        యెక్కువ శ్రీవెంకటేశుఁ డెననెఁ దా నన్ను నిట్టె
        పెక్కు సతులతోననె పెద్ద సేసీఁ దాను