పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0335-3 శంకరాభరణం సంపుటం: 11-207

పల్లవి: ఆడనె ఆకెచే వెంగె మాడించుకోవయ్య
         తోడనె నీ సుద్ది విన దోస మయ్యా

చ. 1: చిత్తము రా కొకమాట చిత్తము వ చ్చొకమాఁట
       వొత్త నీతో నాడ నే నోప నయ్యా
       హత్తిన ఆకెకు నీకే అలవాటు గాని మాకుఁ
       దత్తరించి యింత నేయం దగ దయ్యా

చ. 2: కూడినప్పు డొకచూపు కూడనప్పు డొకచూపు
       యీడా నాడా రెండూ నెరఁగ మయ్యా
       యేడో ఆకెకు నీకు యే మన్న నమరుఁ గాని
       వీడుపడ నింత నేయ వెరతు మయ్యా

చ. 3: సంతసించి వొకనవ్వు సంతంసించ కొకనవ్వు
        మంతు కెక్కి తొల్లె యివి మానితి మయ్యా
        చెంతలఁ గూడితి నన్ను శ్రీవెంకటేశ యాకె
        పంత మాడుఁ గాని మాకుఁ బాడి గా దయ్యా