పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0334-5 దేసాళం సంపుటం: 11-203

పల్లవి: కంటిమి నీ సుద్ద లెల్లఁ గానీరా వోరి మా
         యింట నున్నప్పుడే నీ యిచ్చలు వోరి

చ. 1: చెక్కు లేల పులకించే జెప్పరా వోరి నాతో
       నిక్కి నిక్కి నీ నిజాలె నెరపేవు
       యెక్కడికిఁ బోనివాఁడ వేరా వోరి
       యిక్కడనె బుసకొట్టేవు యేఁటికిరా వోరి

చ. 2: యేడది కుంకుమపూఁత యీ మేన నోరి
       యేడలేనియాచారాలు యీడఁ జేతువు
       ఆడి తప్పనివాఁడవు అవురా వోరి
       యీడ నీ వెంట వచ్చిన దెవ్వతెరా వోరి

చ. 3: తమకించే వింతలోనె తలరా వోరి నాతో
        జమళి నక్క డీ మేలు చల్లేవా వోరి
        అమర శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
        సముకాన నీ మాఁట సమ్మతించే నోరి