పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0334-4 బౌళిరామక్రియ సంపుటం: 11-202

పల్లవి: పాప మంటా నోరిచితేఁ బదరీఁ దాను
         కోపగించి యెవ్వతె యైనఁ గుమ్మీ లేవే

చ. 1: వంతులకు వచ్చి వచ్చి వలపులే చల్లీని
       పంతగాఁడు తన కేమి పని లేదా
       యింత గలితె తన్ను యెవ్వ తైనాఁ బట్టుకొని
       చెంతనె సదమదము సేసీ లేవే

చ. 2: దీమసాన రతులకు దిట్టి తిట్టి పిలిచీని
       బూమిలోన వీని కేమి పొద్దు వోదా
       ఆముకొని యింత లేసి ఆసలకు బెనఁగితే
       గామిడి యెవ్వతె యైనాఁ గలిగీ లేవే

చ. 3: తొడిఁబడ నవ్వి నవ్వి దొమ్మి సేసి కాఁగిలించి
       వొడి వట్టీ వీని కేమి వుండఁ బట్టదా
       బడినె శ్రీవెంకటపతి నన్ను నిదె కూడె
       కడ నింకా నివ్వ తైన కాచుకుండీ లేవే