పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0334-2 నాదరామక్రియ సంపుటం: 11-200

పల్లవి: నీవల్ల దోసము లేదు నేరము నావొళ్లి దింతే
         చేవ దేర నిఁక నీవు సేసినంతాఁ జెల్లురా

చ. 1: కొరి నిన్నుఁ జూచి చూచి కోపగించఁ జాలఁగాని
       చేర నీవు రానందుకు చిమిడీరా నా మనసు
       వోరి నీవు సేసినందు కొల్లక వుండే నంటే
       భారపు నాజవ్వనము పై తరవు వెట్టురా

చ. 2: దీకొని నీ పట్టుకు నేఁ దెగఁ జాలకుందుఁ గాని
       కాకరి నీ నవ్వు లెల్లాఁ గాఁడిపారె నన్నునూ
       వాకున వెళ్లనా డైనా వడిఁ దీర్చుకొనే నంటే
       యీకడ నా మొగమాట మింత సేసె నన్నును

చ. 3: కాఁగిలించి నిన్ను నంత కస్తి నేయ నోపఁ గాని
        రాగిన నా వలపులు రాసు లై వున్నవిరా
        వీఁగక శ్రీవెంకటవిభుఁడ కూడితి నన్ను
        మాఁగి నీ కెమ్మోవి మరిగించెఁ దీపులు