పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0334-1 సౌరాష్ట్రం సంపుటం: 11-199

పల్లవి: నీ విదె నే నదె నెమ్మదిఁ దానూ నదె
         ఆవలి మొగము లేల అద్దరిపా టాయను

చ. 1: వచ్చినట్టిపరాకున వనిత నన్నుఁ గానక
       యిచ్చ నీవద్ధ గూచుండి యిటు చూచి
       యెచ్చరి నీ పే రడిగీ నెరఁగనిదానె వలె
       తచ్చన లిం కేల సమతారుకాణ లాయను

చ. 2: యీడ నాగురు తెరఁగ కీపె వచ్చి వోయి నీతో
       యేడలేనిముచ్చ టాడె యేకతానను
       తోడ నీ వెచ్చరించఁగా తొయ్యలి యామాటలె
       యేడో కతలు సేసీ నిఁక నేల బొంకులు

చ. 3: పరపుపై నిద్దరము పవళించు టెరఁగక
       యిరవుగఁ గాఁగిలించె నిద్దరి నీపె
       గరిమ శ్రీవెంకటేశ కలసితి విట్టె మమ్ము
       దరి చేరెఁ బను లెల్ల తన కేల సిగ్గులూ