పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0333-6 నాదరామక్రియ సంపుటం: 11-198

పల్లవి: కలఁడుగా యిటువంటి గడుసరి భూమిమీఁద
         తెలిసితి మిన్నాళ్లకు దిష్టముగ వీనిని

చ. 1: తగని వెల్లాఁ జేసి తనమాఁటె ఘనము
       జిగి నా మొగము చూచీ సిగ్గు వడఁడు
       నగువారి నెరఁగఁడు నాపై నానలు వెట్టీ
       యెగసక్కీఁడు వీని దెంత నేరుపే

చ. 2: తప్పుజగడాలు రేఁచీ తానె మంచివాఁడు
       యిప్పుడె వావులు చెప్పీ యెవగించఁడు
       ముప్పిరిఁ దల వంచిన మోవితేనె లియ్య వచ్చీ
       చప్పుడు గాకుండాఁ జేరీ జాణ గదే వీఁడు

చ. 3: తమకించు నిన్నటాను తగవరీఁ దానె
       అమరఁ గతలు చెప్పీ నందు కాతఁడు
       తిమిరి శ్రీవెంకటాద్రి దేవుఁ డిట్టె నన్నుఁ గూడె
       సమరతి నిన్నిటాను సరుసుఁడు గదవే