పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0333-5 రామక్రియ సంపుటం: 11-197

పల్లవి: అందు కేమి నీవు మాతో నన వలెనా
         చందముగ నొడఁబరచఁగ నింత వలెనా

చ. 1: ఈ యడకు రా కుండితే యేడనుండైనా నీకు
       చే యెత్తి మొక్కిన దొక సెలవే కాదా
       పాయ మెంత వెంచినాను ప్రాణము నీ కొప్పగించి
       కాయముతో బదికేది ఘనత నీదే కాదా

చ. 2: కన్నులఁ జూడ కుండినా కడ నీ వార మని
       వున్నట్టే వుండుట నీకే వొప్పు గాదా
       మన్ననలు దవ్వైనా మనసు నీపైఁ బెట్టి
       యిన్నిటా నుండుట నీకు నిది గీర్తి గాదా

చ. 3: మునుపఁ జెప్పంపకున్నా మొక్కలాన నిట్టే వచ్చి
       చనవు చేకొనుటే చాలదా మాకు
       యెన లేక శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
       ననిచితి నిది మీకు నయమే కాదా