పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0333-3 దేవగాంధారి సంపుటం: 11-195

పల్లవి: ఈతఁడె నీ కెంత తన విచ్చెనో కాక
         యేతుల నీ గుణముల కిందరూను మెత్తురా

చ. 1: పదరి యాతడు నిన్నుఁ బైఫైఁ బిలువఁగాను
       యెదిటికి రావు లోన నేమి సేసేవే
       మదిఁ గోపము గలితె మాటల నాడుదు గాక
       కదిసి మోనాన నుంటే గర్వ మనరా

చ. 2: అలరి మాటాడి యాడి యాతఁడు లేప వచ్చితే
       యెలమి నిద్దుర బొయ్యే విది యేఁటిదే
       చలము నీకుఁ గలితే సాదించవలెఁ గాక
       నిలిగి ముసుఁ గిడుటే నిష్టూరము గాదా

చ. 3: శ్రీవెంకటేశ్వరుఁడు చేరి కాఁగిలించుకోఁగా
       యీవేళ సిగ్గు వడేవు యిఁకఁ దగునా
       వేవేలు గలిగిన వెనకకె చెల్లుఁ గాక
       భావించి కూడిన మీఁదఁ బచ్చి దొఁచదా