పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0333-2 బౌళిరామక్రియ సంపుటం: 11-194

పల్లవి: అద్దో మానవుగా అదే మే నీవు
         గద్దించి నీవు చూచితే కాళ్లు వణఁకీనా

చ. 1: మచ్చిక నాతఁడు నేడు మా యింటికి వచ్చె నంటా
        పచ్చి గొంతా వెచ్చి గొంతాఁ బలికే వేమే
        బచ్చెనల నతఁడు నీ సాంగెములో వాఁడై
        నెచ్చెలి నీకుఁ గొంకితే నే నీకు వెరతునా

చ. 2: చెప్పి యిందరిలో వాఁడు చేయి నాపై వేసె నంటా
        అప్పటనుండి వుడికే వ దేమే నీవు
        దెప్పర మాతఁడు నీచేఁ దిట్టించుకొనుఁ గాక
        నిప్పువంటిదాన నేను నీచేతఁ బడేనా

చ. 3: గక్కన శ్రీవెంకటాద్రిఘనుఁడు నన్నుఁ గూడితే
       పక్కన నాతనిఁ గొంగు వట్టే వేమే
       చక్క నీ వండ నుంటె సాదించఁ జెల్లుఁ గాక
       యిక్కడ వచ్చే మనేవే యిక నే నోరుతునా