పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0332-6 సామంతం సంపుటం: 11-192

పల్లవి: కూచుండఁ బెట్టుకొనవే కోప మేఁటికి
         కాచుకున్న రమణునిఁ గరుణించ వలదా

చ. 1: నాటుకొన నిన్నుఁ జూచి నవ్వేటిపతితోడ
       మాట లాడఁ గదవే మౌన మేఁటికి
       ఆఁటదాని కింత యేలె అంతవాఁడు వేఁడుకోగ
       కోటి నేరా లేమి గల్లాఁ గూడుకొన వలదా

చ. 2: కొంగు వట్టి నిన్నుఁ దీసి కొసరేటిపతి నిట్టే
       సంగడిఁ గాఁగిలించ వేసట లేఁటికి
       యింగితాన నొక్కవేళ యిద్దరిలోఁ గలఁగితే
       సంగతిఁ జవి సేసుక చన వియ్య వలదా

చ. 3: యిర వై తమ్ములము నీ కింద మనీ నాతఁ డదే
        సిర సెత్త గదవే సిగ్గు లేఁటికి
        నిరతి శ్రీవెంకటాద్రినిలయుఁడు నిన్నుఁ గూడె
        తొరలిన నీరతులఁ దోడు చూప వలదా