పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0332-5 పాడి సంపుటం: 11-191

పల్లవి: ఏమి సేయ వచ్చుఁ గాల మెవ్వరి నెంత సేసునో
         నేమాన నవ్వెటి నన్ను నివ్వెర గందించెను

చ. 1: పలుకు బంతపు నన్నుఁ బ్రాయముగ నింత సేసె
       చెలుల కెల్లాఁ బ్రియము చెప్పించెను
       అలరు రాజసపు న న్నాసలుగా యింత సేసె
       నలి రమణునింటికి నడపించెను

చ. 2: వాసితో నుండేటి నన్ను వలపుగా యింత నేనె
       వేసాల ఆతని మాటె వినిపించెను
       పోసరించి వుండేనన్ను పొందుగా యింత సేసె
       పాసితే విరహవేదనపాలు సేనెను

చ. 3: సిగ్గుతో నుండేనన్ను చిత్తమెకా యింత నేనె
       తగ్గనితమకములఁ దగిలించెను
       వెగ్గళించి యింతలో శ్రీవెంకటేశఁ డిటు గూడె
       అగ్గలపు నా రతులె కా అన్ని టాను మించెను