పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0332-2 రామక్రియ సంపుటం: 11-188

పల్లవి: వరుస నే నెరుఁగుదు వాని గుణము
         కరఁగి నా పేరు వింటే కానుక లందియ్యరే

చ. 1: తగనేఁ గోపగించిన దయ గల దాతనికి
       బిగియఁడు వచ్చీఁ గాని పిల్వరే వాని
       వొగి నే నంత దిట్టినా వోరువు గ ద్దాతనికి
       నగుతా వచ్చీఁ గాని నా పేరు చెప్పరే

చ. 2: మోనాన నేఁ గొసరినా మోహము గ ద్దాతనికి
       పేని పట్టి వచ్చీఁ గాని పిల్వరే వాని
       పూని నేనెం తలిగినా బుజ్జగించ నేర్చుఁ వాడు
       వానికిఁ బొడచూపరే వచ్చీ నిందాఁకలను

చ. 3: ముంపు నే గరివి నైనా మొదల వినయివాఁడు
       పెంపున దానె వచ్చీఁ బిల్వరే వాని
       యింపుల శ్రీవెంకటేశుఁ డిప్పు డిట్టె నన్నుఁ గూడె
       పంపున నీడనె వుండీ పై పైనె మొక్కరే