పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0332-1 హిజ్జిజి సంపుటం: 11-187

పల్లవి: కాంతలాల యింతులాల కంటిరా యిది
         యెంత కెంత కెత్తుకొంటి వెరఁగదా నేను

చ. 1: వొక్కమాట నిన్నంటె వూరివారిపైఁ జుట్టేవు
       మిక్కిలి ముడికాఁడవు మేలురా నీవు
       మక్కళించి నీ చేఁతలు మాయ వలసి యీరీతి
       యెక్క డెక్కడో పెనచే దెరఁగరా నేను

చ. 2: వాదు నీతోఁ బెట్టుకొంటె వాడవారిపై బెట్టేవు
       మేదకపుకొయ్య వదువు మేలురా నీవు
       ఆదెస నీ నేరాలు అందులోనే పులిమేవు
       యేది తుది మొద లౌటా నెరఁగరా నేను

చ. 3: పొంచి నీవె కల్ల వంటె పొరుగు కప్పగించేవు
       మించెను నీ చలములే మేలురా నీవూ
       యెంచి నట్టె శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
       యించుకంత కపటము యెఱఁగరా నేను