పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0331-4 దేసాళం సంపుటం: 11-184

పల్లవి: పెనుఁ బండుగలు సేసి పిలిపించె నిన్నమాపె
         పెనఁగీఁజిత్తపు చింత పెనులంపటముల

చ. 1: చెవులఁ బండుగ సేనె చెలి నీ సుద్దులు విని
       నవకపు వేడుక నిన్నటిమాపె
       తివిరి వేగుదాఁకా దీపాళిపండుగ నేసె
       జవకట్టి నినుఁ బాసి జాగరాలను

చ. 2: కన్నులపండుగ సేసె కలికి మేడపై నుండి
       నిన్నుఁ దప్ప కిట్టె చూచి నిన్నమాపె
       వున్నతి నొక నిమిష ముగాదిపండుగ నేనె
       తన్నుఁ దానె తనలోని తమకానను

చ. 3: నిచ్చపండుగలు సేసే నీతోడి మాటలనె
        నెచ్చెలి యల్లంతనుండి నిన్న మాపె
        పచ్చిగా లక్ష్మీదేవి పండుగలు సేసె నిదె
        యిచ్చకుఁడ శ్రీవెంకటేశ నిన్నుఁ గూడెనూ