పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0331-3 రామక్రియ సంపుటం: 11-183

పల్లవి: సిగ్గరి పెండ్లికొడుకుఁ జేరి చూతము
         వొగ్గి సదమదము లై వున్నాఁ డటా

చ. 1: వద్ది కిట్టె రమ్మనరే వచ్చీనో రాఁడో
       గద్దరి తన లాగులు కందము నేఁడు
       బద్దులో నిజమో కాని పచ్చివెచ్చిచేఁతల
       వొద్దకతో బండుబం డై వున్నాఁ డటా

చ. 2: మాట మాట దియ్యరే మన సెట్లున్నదో
        గాఁటపు తన విద్యలు కందము నేఁడు
       చీటకపుచెమ టట చిట్లుగందా లట
       మేటిదొరఁ బిలువరే మెరసీ నటా

చ. 3: ముసుఁగు దెరవరే మొకము చూతము నేఁడు
       కసుగాటు చేఁత లెల్లఁ గందము గాని
       పసతో శ్రీవెంకటపతి నన్ను నిటు గూడె
       నస చేసి నాతోనె నవ్వీ నటా