పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0331-1 శ్రీరాగం సంపుటం: 11-181

పల్లవి: అయ్యయ్యో భూమిమీఁద నన్నియుఁ గంటిఁ జెరువు
         ముయ్య మూకు డడిగేటి మూడులు గలరుగా

చ. 1: కడ నీ చెక్కుల గోళ్ల కాఁడినపో ట్లుండఁగ
       నొడిగే నా మాట నీకు నొప్పు లాయఁగా
       బడి బడి తల్లిదండ్రి పగ లుండఁగా లంజ
       గొడవలకుఁ బెనగే కూళలు గలరుగా

చ. 2: పెక్కు సతులు నీ మోవి పిప్పి నేసి వుండఁగాను
       యిక్కడ నే వగచుట హీన మాయఁగా
       మిక్కిలి రాళ్ల కోపక మెత్త నైనందు గుద్దలి
       యెక్కువ వాఁడి చేసేయెడ్డలు గలరుగా

చ. 3: తగనియెవ్వతో కాలితాఁకులు నీమై నుండఁగ
        బిగువు నా చన్నులొత్తు బిరు సాయఁగా
        అగపడి శ్రీవెంకటాధిప కూడితి విట్టె
        నగవు నిజాలు సేసేనాథులు గలరుగా