పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0330-6 పాడి సంపుటం: 11-180

పల్లవి: విచ్చేయవయ్యా వేఁగుదాఁకా జాగు లేల
         కొచ్చి చెలులము నేము కొండేలు చెప్పేమా

చ. 1: ఈకడ నన్నే మడిగే వింటికి విచ్చేసితేను
       ఆకెచేతనే వినేవు అప్పుడు నీవు
       జోక నిన్నేఁటికో పిలుచుకొని రమ్మనఁగాను
       దాకొని వచ్చితి నింతే తలఁ పెరుఁగుదునా

చ. 2: ఆన లేఁటికిఁ బెట్టేవు అండకు నీ వేఁగితేను
        కానఁబగీ నన్నియును కాంతవల్లనే
        తానె నీ వేడ నున్నా వెదకి తోడి తెమ్మనఁగ
        మోనాన వచ్చితి నింతే ముంద రెరుఁగుదునా

చ. 3: కరికరఁ బెట్ట నేల కాంత నీవుఁ గూడితేను
        అరయఁగ మంచి వయ్యీ నన్ని పనులు
        యిరవై శ్రీవెంకటేశ యింతివద్దఁ గూచుంటివి
        సరసా లాడఁగాఁ గంటి సర వెరుఁగుదునా