పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0330-3 సామంతం సంపుటం: 11-177

పల్లవి: ఇందుకే పో నేను మీ యింటికి వచ్చితి
         పొంద కింక నేఁ బోనియ్య నిన్ను

చ. 1: కలికి నీ చూపులు కన్నుల నుండఁగ
       నలువంక మమ్ము నాటీ నేలే
       పిలువక మమ్ముఁ బిలిచే మోవి
       వొలుకుఁదేనెల నూరించీని

చ. 2: బాపు నీ కుచములు పయ్యద నుండఁగ
        రేపువలపులు రేఁచీ మమ్ము
        నీపైనే వుండఁగ నీ చక్కఁదనము
        యేపున నా మన సెలయించీని

చ. 3: చేయి చెక్కుతోడఁ జిమ్మే నీసిగ్గులు
        ఆయములు దాఁకీ నద్దో మమ్ము
        యీయెడ శ్రీవెంటేశుఁడ నే నిన్నుఁ
        బాయక కూడఁగఁ బంత మాడేవూ