పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0330-2 ముఖారి సంపుటం: 11-176

పల్లవి: నీవే యెరుఁగుదువు ని న్నాతఁడు పిలువఁగ
         వావాత నూఁకొనవు వద్దు చల మమ్మా

చ. 1: ముక్కున నూర్పులు రేఁగ ముంజేయి వట్టి పెనఁగీ
        వెక్కసపు సంతంటివాఁడు యింత నిన్ను వేఁడుకోఁగ
        యెక్కువ నంతటివాఁడు యింత నిన్ను వేఁడుకోఁగ
        చిక్క కిట్టె బిగిసేవు చెల్లునా వో యమ్మా

చ. 2: పూవుల కొప్పెల్ల జార పుడిసిట నిన్ను నెత్తె
       వోవల పతికి లో నై వుండవే కొంతా
       వేవేలు కాంతలవాఁడు వెస నిన్ను బొదుగఁగ
       నీ వెం తైనా గుట్టియవు నీకుఁ దగ దమ్మా

చ. 3: తా నాతఁడు నీకు లోనై తమకానఁ గూడఁగాను
       ఆన లెల్లఁ బెట్ట వచ్చే వ దేమే యింకా
       పూని శ్రీవెంకటపతి భోగించే నిన్ను రతి
       కానిమ్మని పాయకువే కలకాల మమ్మా