పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0330-1 ఆహిరి సంపుటం: 11-175

పల్లవి: మూల నున్న వారి మమ్ము ముంగిట వేసితివి
         పోళిమి నాఁడువారు నీ పొరు గవుటే దోసమా

చ. 1: వచ్చి వచ్చి చేయి వట్టి వట్టియాన లెల్లఁ బెట్టి
       చెచ్చెర న న్నిట్టె లోను సేసుకొంటివి
       యిచ్చకుఁడ నన్నువలె నెవ్వతిఁ జేసితివో
       యెచ్చి మగనాండ్లకు నీ యింటికి రాఁ బాసెరా

చ. 2: సారె సారె నవ్వు నవ్వి జవ్వాది చెక్కులఁ బూసి
        పారి పారి నన్ను నింత భ్రమయించితి
        వూరివారి నెల్లా నంతా వోరి కలయఁ గొంటివో
        వారించి మానాపతులు వాడ నుంటే నేరమా

చ. 3: మెల్లనె మెల్లనె మొక్కి మేర మీరఁ గాఁగిలించి
        కొల్లగా శ్రీవెంకటాద్రిఁ గూడితి నన్ను
        వెల్లివలపులు చల్ల వెన్నముద్దకృష్ణుఁడా
        గొల్లెతల కెల్ల నీ కుల మౌటే తగులా