పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0329-6 శంకారాభరణం సంపుటం: 11-174

పల్లవి: ఏ మందునె యిందు కిట్టె నిన్ను
         కామిను లిట్లెతే కాలమహి మెట్లో

చ. 1: అతఁడు నాతో నవ్వినట్టినవ్వు నీ మీఁదికి
       యేతులకుఁ దీసుకొనే విది మేలే
       పోతరించి వుప్పు వేసి పొత్తు గలయ వచ్చేవు
       చేతులఁ బట్టఁగ రాదు చెలి కూ ళైతేను

చ. 2: పేరుకొని నన్నతఁడు పిలువఁగ నది విని
        యీరీతి నీవే పలికే విది మేలే
        నీరువట్టు గొన్నవేళ నెయ్యి వోసే వాతనికి
        ఆరయ సిగ్గు లేనియాఁటదె పసురమా

చ. 3: చేయి నాపై వేయఁ బోతే శ్రీ వెంకటపతికి
        యీయెడఁ గైదండ చిచ్చే విది మేలే
        పాయక యీ శ్రీవెంకటపతియే నన్నునుఁ గూడె
        చాయ యెఱఁగనియట్టి సతియె పో ములుచా