పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0329-5 మాళవిగౌళ సంపుటం: 11-173

పల్లవి: నీకే చెల్లుఁ గాని నే నింత కోపను
         కాకరితనా లెప్పుడుఁ గలవే నీకును

చ. 1: రమణితో నొకమాట రతి నాతొ నొకమాట
       అమరదు యెన్నఁడు నీ వాడకురా
       కమలము వొకకన్ను కలువయు వొకకన్ను
       జమళి రండు నడప సాజయే నీకును

చ. 2: కంటే నిందు వచ్చే వాకడిమో మైతే రావు
       అంటి నన రాదు మాతో నంత యాలరా
       వొంటనిసా మొకటియూ వొగి గరుత్మంతుని
       బంటులఁగా గాడిఁ గట్టి పరచేటివాఁడవు

చ. 3: కాఁగిలించే విటు నన్ను కన్ను గిరిపే వాపెతో
       దాఁగిలిముచ్చు లాడేవు తగ దేలరా
       యేఁగి మింటి కొక కొంగ యెత్తి శ్రీవెంకటగిరి
       నాఁగితి రెండు వాదాలు నౌరా నీవూ