పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0329-4 హిందోళవసంతం సంపుటం: 11-172

పల్లవి: అల్లదె నీ రమణి ఆయిత్తమై వున్నది
          పెల్లుగ జాజరాడఁ బిలిచీఁ బోవయ్యా

చ. 1: వనితచూపులు కలువల వసంతములు
       ఘన మైనమోహము గంధము వసంతము
       మనసులో కోరికలు మంచినీళ్ల వసంతము
       పెనఁగి జాజరలాడఁ బిలిచీ నయ్యా

చ. 2: కలికినవ్వులు నీకు కప్పురవసంతములు
       నిలిచినకళలు వెన్నెలవసంతములు
       పలుకులకొసరులు బంగారువసంతము
       బెళకక జాజరాడఁ బిలిచీ నయ్యా

చ. 3: కేలు పట్టి తీసినది కెందామరవసంతము
       చాలుఁ బులకలు ముత్యాలవసంతము
       యీలాగుల శ్రీవెంకటేశ ఆకెఁ గూడితివి
       పేలరి యై జాజరాడఁ బిలిచీ బోవయ్యా