పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0329-2 శంకరాభరణం సంపుటం: 11-170

పల్లవి: ఒంటి నన్ను నవ్వ వచ్చీ నో యమ్మా
         వుంటవింట వేయు మనీ నో యమ్మా

చ. 1: సుద్దు లవి విను మంటా సొరిదిఁ జెక్కులు ముట్టీ
       వొద్దన్నా మానఁడే వోయమ్మా
       గద్దించి యందుకు నేను కడు జంకించఁ బోతేను
       వుద్దండపుమాట లాడీ నూరకే వో యమ్మా

చ. 2: బడి బడి రమ్మంటాఁ బట్టఁ బట్టఁ బైకొని
       వొడిసీ నీ పయ్యదను నోయమ్మా
       తదవకు మని నేను తన్ను నాన వెట్టితేను
       ఉడికి తప్పక చూచీ నూరకే వో యమ్మా

చ. 3: పనిమాలి నేఁడే తన పాదుములు గుద్దు మంటా
        వొనర బలిమి నేసీ నో యమ్మా
        యెనసెను శ్రీవెంకటేశుఁ డిటువలె నన్ను
        వుని కై నిలిచితిమి వూరకే వో యమ్మా