పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0328-6 సాళంగనాట సంపుటం: 11-168

పల్లవి: దూరఁ బోతేఁ గోపము దొరకు ముక్కున నుండు
         వూరకే తోడుక రారే వొడఁబరచేనూ

చ. 1: అవుఁగా దనకురే ఆడినట్టె ఆడనీరే
       యివల నేనే చెప్పే నిన్ని బుద్దులు
       తివిరి మీ రిందాఁకాఁ దెచ్చినదే మీపాలు
       అవల నంతటిమీఁద నాతడు నాపాలు

చ. 2: చేచేతఁ బెనఁగకురే సేసినట్టే సేయనీరే
        యేచి నేనే సేవ సేసే నీడుకు నీడు
        కాచిన మమ్మిద్దరినిఁ గదియించుట మీ పని
        చూచి వానిఁ గరఁగించి చొక్కుట నా పని

చ. 3: పంత మె ట్టైనై వచ్చి బలిమి సేయకురే
        మంతనాన మెచ్చు సేసే మంకు లెల్లాను
        యింతలో శ్రీవెంకటేశుఁ డిదే కదే నన్నుఁగూడె
        వంతులే నీకుఁ జెల్లె వాసి నాకుఁ జెల్లె