పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0328-5 శంకరాభరణం సంపుటం: 11-167

పల్లవి: చెల్లఁబో నాకె సుద్దులు చెప్పకువయ్య
         పల్లదాన నీవు నీవే బదుకవయ్యా

చ. 1: యేమయ్య నేము నీ కేమిటి కయ్యా
        నేమాన నీ కిచ్చ లాడ నేరనయ్యా
        చేముంచి యాపె కీ మేలు సేయనయ్యా
        మోము చూచి సంతంసించి మొక్కేనయ్యా

చ. 2: తలవయ్య మమ్ము నేల తడవేవయ్య
        నెలవై నే నిజ మాడి నిష్టూరి నింతే
        కెలసి యాకెనె బుజ్జగించవయ్యా
        వలచి నే నెపుడు నీ వద్ద నుండే నయ్యా

చ. 3: చెల్లు నయ్య యే మైనాఁ జేయవయ్యా
        యెల్లవారివలె నేమీ నెరఁగ నయ్యా
        కొల్లగా శ్రీవెంకటేశ కూడితివి నన్ను నిట్టె
        తెల్లముగ నీ వెంటఁ దిరిగే నయ్యా