పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0328-4 సామంతం సంపుటం: 11-166

పల్లవి: తా నేల నిలుచున్నాఁడు తడవుల నుండీని
         పానిపట్టి చెలులాల పద మనరే

చ. 1: మనసు రాని తలఁపు మాటలోనె కాన వచ్చు
       పెనఁగి యప్పటి వీఁడు పిలిచీఁ గొంతా
       ననుపు గల దెల్లాను నవ్వినందే తెలిసితి
       పని గద్దు వచ్చేఁ గాని పద మనరే

చ. 2: నెరమెచ్చువలపులు నిలిచినందే తోచె
        సరసాన వీఁడె చేయి చాఁచీఁ గొంతా
        కరుణ గల దెల్లాను కనుచూపులనె కంటి
        పరిణామ మాయ నాకుఁ బద మనరే

చ. 3: కలిగిన తమకము కాఁగిటిలోఁ గానవచ్చె
        అలరి తాఁ బెట్టుకొనీ ఆనలూఁ గొంతా
        వెల లేని వేడుక శ్రీవెంకటేశుఁ డిటు గూడె
        పలుకు లేఁటికి నిఁకఁ బద మనరే