పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0328-3 సామంతం సంపుటం: 11-165

పల్లవి: ఈపాటివాఁడవు యేల కొపగించితివి
         చేపట్టినటులానె సేయ రాదా

చ. 1: చెక్కు నొక్కకుర నీవు చేయి చాఁచకుర నాపై
       చక్క నీ మంచితనాలు చాలుఁ జూలు
       పక్కనఁ గోపించ వద్దు పైకొని వేఁడుకో వద్దు
       వొక్కమారె యింతేసికి నోపను నేను

చ. 2: కాలు దొక్కకుర నీవు కమ్మటి నవ్వకు నాతో
       జాలినీ యిచ్చకములు చాలుఁ జాలు
       తాలిమిఁ దిట్టా వద్దు దగ్గరి మొక్కా వద్దు
       మేలు మీఁదనె వుండే మేరతో నడవరా

చ. 3: మాటలాడకుర నీవు మాయలు సేయకురా
        చాటు వాయ నీవలపు చాలుఁ జూలు
        గాఁటపు శ్రీవెంకటేశ కరఁగించి కూడితివి
        మేటి నీ గుణములకు మెచ్చితి నే నిదివో