పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0327-6 లలిత సంపుటం: 11-162

పల్లవి: చక్కని యీ వెన్నుఁడూ సంబటూరి చెన్నుఁడూ
          అక్కడ నిక్కడ చూపి ఆసలు రేఁచీని

చ. 1: చెన్నునిఁ జూడఁ గదరే చెలులాల నేఁడు
       చిన్ని లేనవ్వులనె చెలరేఁగీని
       సన్నలు నేసీ వాఁడె సటకాఁడు నాతో
       యెన్నటి కెన్నటి పొందు యిపుడే రేఁచీని

చ. 2: యే మనీనె చెన్నుఁడూ యేకతాన నన్నునూ
        దొమిటివావులు నాపైఁ దొరలించీని
        కోమలపు చేయి చాఁచీ కొత్తపెండ్లికొడుకు
        గామిడితనాల నన్నుఁ గాకలు రేఁచీని

చ. 3: శ్రీవెంకటాద్రిమీద చేరి కూడెఁ జెన్నుఁడు
        బావించి పచ్చడము పైఁ గప్పీని
        మోవి చూపీఁ గమ్మటి మెక్కళీఁడు వీఁడు
        దేవుఁడు గదవే వీఁడు తీపులు రేఁచీని