పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0327-5 లలిత సంపుటం: 11-161

పల్లవి: అన్నియు నేరుచుకొన్నాఁ డలవాటే యాతనికి
         యెన్ని యైనఁ గల విట్టే యింటి కింక రావే

చ. 1: వట్టిమాకు లిగిరించు వాఁడు మాట లాడితేను
        యిట్టె నన్ను గరఁగించు టేమి సోద్యమే
        వెట్టికి వింటేం జాలు వేగాదాఁకఁ జేప్పీఁ దాను
        బట్టబయ లీఁద నోపఁ బదవే మాయింటికి

చ. 2: ఱాతికి గిలిగింత లౌ ఱట్టడినవానిచేఁతల
        యీతల నన్ను నవ్వించే దేమి సోద్యమే
       చేతికి లో నైతేఁ జాలు సేయఁగల ట్టెల్లాఁ జేసి
       పోతరించి వున్నవాఁడు పోదమే మా యింటికి

చ. 3: యేరు లైన నెదు రెక్కు యిట్టి వీనిఁ బొడగంటే
        యీరీతి మనము వచ్చే దేమి సోద్యమే
        చేరినన్ను నిటు గూడె శ్రీవెంకటేశ్వరుఁడు
        ఆరె దేరెఁ బిలువవే అతని మాయింటికి