పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0327-4 సాళంగనాట సంపుటం: 11-160

పల్లవి: పొద్దు వోదా తన కేమి పోరు వెట్టి వేగి తేచి
         ఉద్దండీఁడు తన కేమి పూరకుండఁ బట్టదా

చ. 1: యెప్పటి కుత్తర మిచ్చే దప్పుడే యిచ్చేఁ గాక
       యిప్పటినుండియు మాట లేలే నాకు
       కప్పి నిజ మాడు మంటా కమ్మర నానవెట్టిని
       తప్పు లౌతా వొప్పు లౌతా నెరఁగఁడా

చ. 2: చేయవలసినప్పుడే చేయి ముంచి చేసేఁ గాక
       యీ యెడ నుండియు బంతా లేలే నాకు
       ఆయ మంటి వేగిరించి నప్పుడె తనకుఁ దానే
       కా యౌతా పండౌతాఁ గనీఁ గాకా

చ. 3: దగ్గరితి మిద్దరము తరవాయి వచ్చీఁ గాక
       యెగ్గులు నెమ్ములుఁ బట్ట నేలే నాకు
       బగ్గన శ్రీవెంకటాద్రిపతి నన్నుఁ గూడె నిఁక
       ముగ్గుపిండి అట్లకు మొద లయ్యీనా