పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0327-3 సామంతం సంపుటం: 11-159

పల్లవి: వలపు చప్ప జేసెటివగకాఁడనీ
         బలిమి నా మనసుకు బల్ల కట్ట వలెనా

చ. 1: పలికేవు కమ్మటిని పరాకు నయ్యేవు
       అలిగినాఁ బోనీవు అదేరా నీవు
       పిలిచితే వచ్చినది పెనుఁ దప్పు నావొళ్లఁ
       గలదు నీ విఁక నన్నుఁ గాకు నేయ వలెను

చ. 2: పైపైఁ గొంగు వట్టేవు పరులతో నవ్వేవు
       వోప నన్నఁ బోనీవు వోరి నీవూ
       పాప మింతే నీవు నేసే భ్రమకు లో నయినది
       యేపున నెంతైనాఁ గద్దు యింత సేయ వలెనా

చ. 3: యిచ్చగించి కూడేవు యే మేమో తలఁచేవు
       హెచ్చి మూల నుండనీవు యేరా నీవూ
       అచ్చపు శ్రీవెంకటేశ అన్ని టాను నిన్ను గూడి
       మెచ్చినదె మే లాయ మేకు నేయ వలెనా