పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0327-2 దేసాళం సంపుటం: 11-158

పల్లవి: ఏల మమ్ముఁ జెనకేవు యెడ్డవా నీవు
         వేలఁ జూపేరు నిన్నునె వినుకొన రాదా

చ. 1: యేరా మా కస్తూరిబొట్టు యె ట్టుండె నేమి నీకు
       గోర దిద్ద వచ్చేవు కూళవా నీవు
       గారవపు నీ మేనఁ గస్తూరి రేక లవిగో
       తేరకొన వంక లెల్ల దొద్దుకొన రాదా

చ. 2: చెల్లఁబో నా హారములు చిక్కువడితే నేమి
       మల్లాడి దిద్ద వచ్చేవు మంకవా నీవు
       చిల్లా పొల్లాయ నీ మెయిఁ జెమటముత్తెము లెల్ల
       పెల్లు రేగి నీవె చక్కఁ బెట్టుకొన రాదా

చ. 3: చనుఁగొంగు జారె నంటాఁ జక్క దొబ్బ వచ్చేవు
        చనవున నన్నిటాను జాణవా నీవు
        చెనకి కాఁగిలించితి శ్రీవెంకటేశ నీవు
        ననిచి నీ పచ్చడము నాకు గప్ప రాదా