పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0327-1 శంకరాభరణం సంపుటం: 11-157

పల్లవి: కోపము దీరినమీఁదణ గూడేవు గాక
         కైపుగ నీ వొళ్లిదె కల్ల యనవయ్యా

చ. 1: యే మంటివో కాని యింతి గడుఁ జిన్నఁ బోయ
       వేమారు నలుక దీర వేఁడుకోవయ్య
       ప్రేమతో బలిమి నేసి పెనఁగి యేమి నేసితో
       వాములుగఁ దిట్టకోనీ వద్దనవయ్యా

చ. 2: యింతిచిత్తము నొవ్వఁగ యెవ్వరిదిక్కు చూచితో
       అంతలో దల వంచె లే దనవయ్యా
       అంతటఁ బోక నీవు అట్టె యేమి నవ్వితివో
       చింతతో లోనికిఁ బోయీ చేరి పట్టవయ్యా

చ. 3: మితియేమి మీరితివో మెలుఁత నిట్టూర్పు నించె
       చతురతఁ గరిములు చల్లవయ్యా
       తతితో శ్రీవెంకటేశ దగ్గరి కూడితి వాకె
       రతి నలనెను మోవిరస మియ్యవయ్యా