పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0326-6 కొండమలహరి సంపుటం: 11-156

పల్లవి: ఇద్దరి మనసులు నేక మైనఁ గా
         కొద్దిక విరివో టొనరీనా

చ. 1: చెలువుఁడు యేమో చింతించఁగ నే
       కలయు మనుట సంగతు లౌనా
       వలవనియలపుతో వడఁబడి యండఁగ
       యెలమి నేఁ జెనకు టిం పవునా

చ. 2: అదె పొడిఁ బడి పతి యసు రుసు రనఁగా
        పదరి నేఁ బిలుచట పాడి యౌనా
        నిదరుమోముతో నెరి విరి గుండఁగ
        గుదిగొని నేఁ బైకొనఁ దగవా

చ. 3: తమకించి యతఁడు దవ్వుల నుండఁగ
       జమళిఁ గలయఁ బోతే సర వెవునా
       తిమిరి శ్రీవెంకటదేవుఁ డతఁడె నను
       ప్రమదమునఁ గలనెఁ బాసీనా