పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0326-5 ముఖారి సంపుటం: 11-155

పల్లవి: అప్పుడే బలిమి సేసే వందు కేమి
         చిప్పిలఁ బనివనిగాఁ జెప్పర నాతోను

చ. 1: వోప నంటాఁ బెనగఁగ వొడివట్టి తియ్యకురా
       కోపపుఁ జూపులు కనుఁగొనే వారము
       చేపట్టి తీదీపులను చేయి దాఁకు గాలు దాఁకు
       ఆఁపి మాట మాటగాఁనె ఆడరా నాతోను

చ. 2: పెడమర లుండఁగాను పేరునఁ బిలవకురా
       వడి మురిపెముల గర్వపువారమూ
       తడవఁగఁ బలుమారు తప్పు లౌనో వొప్పు లౌనో
       నడుమ నవ్వు నవ్వుగ నవ్వరా నాతోను

చ. 3: పవళించి వుండగాను పైపైఁ బడే వ దేమిరా
       చివురేచేఁ గల గోరిచేతివారము
       యివల శ్రీవెంకటేశ యిట్టె కూడితిని నన్ను
       చవిగా ముద్దుముద్దుగాఁ జన వీరా నాకునూ