పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0326-4 శ్రీరాగం సంపుటం: 11-154

పల్లవి: బలిమి నేయకురే పట్టి పెనఁగకురే
         పొలసి పొ వచ్చినాఁడు పోనియ్యఁ గదరే

చ. 1: కొసరే మా మాటలు కూరిములో తేటలు
        నసలు నేఁ డిం పౌనా నాఁడే కాక
        వస మైనాఁ డెవ్వతెకో వలసీ నొల్లము లీడఁ
        బొసఁగీనా వాని కట్టె పోనియ్యఁ గదరే

చ. 2: రవ్వల మా పిలుపులు రాయిడించే సొలపులు
       నవ్వులు నేఁ డిం పౌనా నాఁడే కాక
       యేవ్వ తాస యిచ్చనదో యింతకు నేరఁడు తొల్లి
       పువ్వువంటిది వలపు పోనియ్యఁ గదరే

చ. 3: తనవోనిరతులనును తలపోఁతమతులును
        ననుపు నే డిం పౌనా నాఁడే కాక
        యెననెను శ్రీవెంకటేశుఁడింత సేసి నన్ను
        పొనిగి పోయినసుద్ది పోనియ్యఁ గదరే