పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0326-3 వరాళి సంపుటం: 11-153

పల్లవి: ఏ మని చెప్పుదు మయ్య యీపె వలపు
         నీ మేని రతులఁ జొక్కి నేర మెంచీ నిపుడు

చ. 1: అద్దము చూచి చెలి యంతలేనో నవ్వు నవ్వి
       గద్దరిచూపుల నీ మొగము చూచెను
       యిద్దరుఁ గూడి యున్నప్పు డెరఁగ దాయనో కాని
       చద్దిగురుతులకే సాధించీ నిపుడు

చ. 3: పొలిఁతి బాగా లందుక పుక్కిట నీ విడినట్టి
        తొలుతటితమ్మ చూచి తల వంచెను
        కలసినప్పటివేళ గతు లెట్చుండెనో కాని
        సొలసి యందుకుఁ గానె సూడి వట్టీ నిపుడు

చ. 3: పవళించఁ బోయి నీవే పర మయి వుండఁగఁ జెలి
       జవళివేడుకలకు సంతంసించెను
       యివల శ్రీవెంకటేశ యే మని మెచ్చెనో కాని
       కవ గూడి మన్ననల మించీ నిపుడూ