పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0326-2 గౌళ సంపుటం: 11-152

పల్లవి: ముంచి నిన్నే మనఁ జాల మొక్కే మయ్యా నీ
         మంచితన మెల్లఁ గంటి మరఁగే లయ్యా

చ. 1: యేకతాన నే నిన్ను నే మంటినో యంటా
       ఆకడఁ జెలులతోడ నాడుకొనేవు
       చేకొలఁది వైన నిన్నుఁ జేసినచేఁతలు మరి
       రాకల పోకల నింత రచ్చ వేతురా

చ. 2: తరితీపులను నీపైఁ దమకించితి నంటా
        యిరుగుపొరుగు లేల యెరిఁగించేవు
        సరసుఁడ వైన నిన్ను చనవునఁ గొసరితే
        విరివి గొనుచు వెల్లవిరి నేతురా

చ. 3: గెంటక పెనఁగేవేళ గిలిగించితి నంటా
        యింటివా రెల్ల వినఁగ నేల నవ్వేవు
        జంటవై శ్రీవెంకటేశ సరి నన్నుఁ గూడితివి
        నంటుతమకము లింత నాన వేతరా