పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0325-5 వంతవరాళి సంపుటం: 11-149

పల్లవి: ఇదివో నా భాగ్యము యేమి చెప్పేనే
         ముదముతోఁ దన కొట్టె మొక్కితి నే ననవే

చ. 1: చుట్టమైన యట్టివాఁడు సులభఁ డైనట్టివాఁడు
       దట్టమై నా కిన్నిటాను తానే కదే
       పొట్టఁబొరుగున నుండి పొరచి వెట్టంపి నేఁడు
       గట్టిగా నింతకరుణ గలదు గా నాకు

చ. 2: అంతరంగ మైనవాఁడు ఆయ మెరిఁగినవాఁడు
       చెంతలఁ దానే అని చెప్పేఁ గదే
       వంతులు వాసు లెంచక వాకిటికి వచ్చె నేఁడు
       యింత మన్నించఁ దాఁ గాక యిఁక నెవ్వరే

చ. 3: వహించుకొనేవాఁడు వద్ద నిట్టె వుండేవాఁడు
       విహరించ నా కిన్నటా వెలనె తానె
       వహి కెక్క శ్రీవెంకటవల్లభుఁ డితఁడే నన్ను
       తహతహ దీరఁ గూడె తగవరి అవుఁ గదే