పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0325-4 దేసాళం సంపుటం: 11-148

పల్లవి: కడవారి నీ మా టడుగవే నీవు
         వెడగు నీ గుణములు విచారించుకొనవే

చ. 1: నీసవతి నైతిఁ గాక నిన్ను నే మైనా నంటినా
       వాసు లెక్కించుక వట్టివా దేలే నీకు
       ఆల నిద్దరికిని ఆతఁడే గురుతు గాక
       రేసులు వుట్టించి యాల రేఁచేవే మమ్మును

చ. 2: తప్పక చూచితిఁ గాక తడవితినా నిన్ను
        వుప్పటించి యంతేసి మ మ్మొరనేవే
        తప్పులుఁ దారులు వాప తగ వాతఁడే యెఱఁగు
        చప్ప నాయ మానవే నీట లెల్ల నిఁకయ

చ. 3: తెలిసితి నన్నియు నీ తెరువు వచ్చితనా
        చలము లిక్కడ నింక సాదించకువే
        అలరి శ్రీవెంకటేశుఁ డన్నిటాను నన్నుఁ గూడె
        పెలుచవు నిన్నెఱుఁగు పెనఁగ నేమిటికే