పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0325-3 రామక్రియ సంపుటం: 11-147

పల్లవి: కైవస మై తనకు నేఁ గలదానను
         తావుల నా మన సెల్ల తా నెణుఁగునే

చ. 1: పెక్కుసతులు గలిగి పెద్దగా బదుక నీవే
       చొక్కపుఁ గన్నుల దన్నుఁ జూచేఁ గాని
       యిక్కువ నందరి సొమ్ము లెల్ల ధరించుకో నీవే
       చక్కఁగా నేఁ బెట్టినంత సంతోసమూ

చ. 2: వియ్యా లంది వీడుకూళ్లు వేమారుఁ గుడువ నీవే
        వొయ్యనె తనకు లో నై వుండేఁ గాని
        ప య్యాడినవారిచేతి బాగా లందుకో నీవే
        యియ్యకో లై ఆకు మడి చిచ్చేఁ గాని

చ. 3: సమరతి నుపరతి జల్లఁగా వెలయ నీవే
        తమితో సేవలు నేసి దక్కేఁ గాని
        అమర శ్రీవెంకేటశుఁ డట్టె నన్నుఁ గూడ నీవే
        గుమి గూడి నేఁ గూడి గురి యైతి నిపుడూ