పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0325-1 సామంతం సంపుటం: 11-145

పల్లవి: దగ్గర నున్నా నతఁడు తానె యెరుఁగును
         వెగ్గళించకురె మీరు విచారించె నన్నియు

చ. 1: ఆస పడినట్టివాఁడు ఆయములె అంటుఁ గాని
       వోసరించి గుట్టుతోడ నూరకుండఁడు
       వాసితో నే నుండగానె వల పల్లా గాన వచ్చీ
       వేరించకురే మీరు విచారించె నన్నియు

చ. 2: సత మైనయట్టివాడు చనవులె యించు గాని
       రతికి నెక్కక వేరె రవ్వ నేయడు
       తతి దప్పకుండఁగానె తగ వెల్లా నీడేరి
       వెత సేయకురె మీరు విచారించె నిన్నయు

చ. 3: చెక్కు నొక్కినట్టివాడు చెప్పినట్టె సేసుఁ గాని
        తక్కించి వేరె తాను దమకించడు
        యిక్కు వెరిగి శ్రీవెంకటేశు డిట్టె కూడె నన్ను
        వెక్కసము లాడకురె విచారించె నన్నియును