పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0324-6 బౌళి సంపుటం: 11-144

పల్లవి: తానె యెఱుఁగుఁ గాక తరవాతి చేఁతలు
         వీనుల మా బుద్దు లిఁక వినేవా నీ వయ్యా

చ. 1: ఫైకొని చెలియనీకుఁ గానుక వట్టు కుండఁగ
       యేకడో పరా కై వుంటి విందాఁకను
       సాకిరి వెట్టెను సన్నీ సరితలు చూడు మంటా
       యీకడ నిన్ను నేనే యే మనఁగల నయ్యా

చ. 2: దగ్గరి విన్నపానకు తరుణి గాచు కుండఁగా
       వొగ్గక వంటివి తడ వున్నదాఁకాను
       యెగ్గు వట్టి మాఁటు నేసీ నిటువంటివాఁడ వని
       దిగ్గన నీ వోజలు దిద్దేనా నే నయ్యా

చ. 3: లోనికిఁ దీసి ని న్నింతి లోను సేసుకొనఁగాను
        మోహనాననే వుంటి వట మొక్కుదాఁకను
        పూని శ్రీవెంటేశ నీ పొందిక నాతోఁ జెప్పె
        నే ననకున్న నంతేసి నేరవా నీ వయ్యా