పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0324-5 నాదరామక్రియ సంపుటం: 11-143

పల్లవి: ఇద్దరు నున్నారు యెదురెదురనె మీరు
         బద్దుల మీతో నాడఁ బని లేదుమాకు

చ. 1: సెలవి నవ్విననవ్వు సిగ్గులకు మొద లాయ
       పలకు దందుకె నీతోఁ బలుమారును
       నెలఁత నెచ్చరించేది నీ చెతిదె యిఁక
       బలిమి నేయఁగ మాకుఁ బని లేదు యిఁకను

చ. 2: చెక్కునఁ బెట్టినచేయి చేఁతలకు మూల మాయ
       చక్కఁగా నందుకె నిన్ను సారెఁ జూడదు
       నిక్కి యాపె బుజ్జగించ నీ చేతదిదె యిఁక
       చిక్కించుక నేము బుద్ది చెప్పఁ బని లేదు

చ. 3: ముంచినవూరుపు లెల్ల మోహానకె తగు లాయ
        పంచల నందుకె నిన్నుఁ బాయ నోపదు
        కొంచక శ్రీవెంకటేశ కూట మిది నీచేతిదె
        మించి యప్పటి నేల మెచ్చేరు చెలులు