పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0324-4 రామక్రియ సంపుటం: 11-142

పల్లవి: ఊరకె గుట్టున నిఁక నండవయ్య
         యే రీతి కైనా వచ్చు యీ చేఁత లయ్యా

చ. 1: కన్నుల నీవు నవ్వితె గక్కనఁ గోపము వచ్చీ
       వున్నతిఁ జలము రేచ కుండవయ్య
       వన్నెలు వాసులతోడ వడి బతికేవారము
       నిన్నువలెనా నేము నిలవయ్యా

చ. 2: కొంగు వట్టే విట్టె నీవు కొలఁది వీరేను నేను
       వుంగిటాయ సరసము లుండవయ్య
       కుంగనబీరములు యేగ్గులపుట్టలము నేము
       యెంగిలి కోరుతువు నిన్నే మనేమయ్యా

చ. 3: బలిమి సేసేవు నీవు పంతము లెక్కీ నాకు
       వొలిసిన వెల్ల నాయ వుండవయ్య
       కలతి విట్టె నన్ను కాఁగిట శ్రీవెంకటేశ
       చెలిమి మనకు నేఁడు చెల్లునయ్యా